బెస్ట్ ఫ్రెండ్స్

హలోహూ .......!🙋



             ప్రియమైన మిత్రులారా


మనం ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం  ...!

 పుస్తకాలతో ప్రాణం నిలిపిన మిత్రుడు 

ఎలక్ట్రిసిటీరంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు కారకుడైన నికోలా టెస్లా , ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్లది విచిత్రమైన బంధం . టెస్లా తనకెవరో తెలియకముందే ట్వైన్ అతడి ప్రాణాలను నిలబెట్టిన వాడయ్యాడు . టెస్లాకు యవ్వనంలో జబ్బు చేసింది . డిప్రెషన్ లోకి కూరుకుపోయాడు . డాక్టర్లు దాదాపుగా చేతులెత్తేశారు . అతడు అలాగే డిప్రెషన్లో ఉంటే బతకడం అసాధ్యమన్నారు . అలాంటి పరిస్థితుల్లో టెస్లాను వీలైనంత ప్రశాంతంగా ఉంచగలిగితే బతికించే అవకాశాలు ఉండొచ్చని డాక్టర్లు తేల్చారు .


అందుకోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసి టెస్లాకు పుస్తకాలు చదవమని చెప్పారు . అక్కడే అనుకోకుండా టెస్లాకు మార్క్ ట్వైన్ పుస్తకాలు పరిచయమయ్యాయి . వాటిని చదివాక టెస్లా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు . ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అయ్యాడు . కొద్దిరోజుల్లోనే కోలుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు . సరిగ్గా ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత టెస్లాకు మార్క్ ట్వైనను కలుసుకునే అవకాశం దక్కింది . అప్పటికి టెస్లా సైంటిస్ట్ గా ప్రఖ్యాతి గడించాడు . సాహితీరంగంలో మార్క్ ట్వైన్ అప్పటికే ఒక దిగ్గజం . ఇద్దరి ఆలోచనలూ కలవడంతో వయసుతో సంబంధం లేకుండా వారి మధ్య స్నేహం కుదిరింది . “ ట్వైను కూడా సైన్స్ అంటే ఇష్టం కావడంతో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే వేరే ప్రపంచానికి దగ్గరైనట్లు ఉండేది " అన్నాడు టెస్లా ఓసారి ట్వైన్ గురించి మాట్లాడుతూ . కనీసం ముఖ పరిచయమైనా లేకుండా మొదలైన ఈ స్నేహం జీవితాంతం కొనసాగింది . ఇప్పుడు వీరిద్దరి స్నేహగాథను ' టెస్లా అండ్ ట్వైన్ ' పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు

స్నేహితుడి తుదిశ్వాస పదిలం ...  

థామస్ అల్వా ఎడిసన్ .. టెక్నాలజీలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చిన సైంటిస్ట్ . గ్యాతో నడిచే ఆటో మొబైల్ ను వెలుగులోకి తెచ్చిన హెన్రీ ఫోర్డ్ కూడా ఎడిసనను హీరోలుగా భావించే వారిలో ఒకరు . ఎడిసన్ స్థాపించిన కంపెనీలోనే ఫోర్డ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసేవాడు . అప్పట్లో ఫోర్డ్ తన తీరిక వేళల్లో గ్యాణ్ నడిచే కారును తయారుచేస్తూ ఉండేవాడు .


1896 లో ఒకరోజు స్వయంగా ఎడిసనే ఈ విషయం తెలుసుకొని ఫోను అభినందించాడు . ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు . ఫోర్డ్ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు . ఎడిసన్ తో కలసి బిజినెసను విస్తరించాడు . 30 ఏళ్లకు పైనే ఈ బంధం కొనసాగింది . ఎడిసన్ ప్రోత్సాహమే లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదంటూ ఫోర్డ్ చెప్పుకొనేవాడు . ఎడిసన్ కూడా ఫోర్డ్ స్నేహాన్ని గొప్పదిగా చెబుతూ ఉండేవాడు . ఎడిసన్ చివరి శ్వాస విడిచే రోజు ... 1931 అక్టోబర్ 18 న ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు ఫోర్డ్ . ఆయన చివరిశ్వాసను ఒక టెస్ట్ ట్యూబ్ లో బంధించాడు . ఆ సమయానికి ఆయన పీల్చిన గాలిని టెస్ట్యూబ్ లో బంధించి దాన్ని ఫోర్డ్ ఎస్టేట్లో ఉంచాడు . ఇప్పుడు ఎడిసన్ చివరి శ్వాస హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో పదిలంగా ఉంది .

ఖైదీ .. జైలర్ .. ఫ్రెండ్షిప్ ! 

అది 1978 దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా రాబెన్ ఐలాండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న రోజులు . అప్పుడే 18 ఏళ్ల క్రిస్టో బ్రాండ్ అనే జైలర్ నెల్సన్ మండేలాను చూసుకునే బాధ్యతలో చేరాడు . బ్రాండక్కు మొదట్లో మండేలా పెద్దగా నచ్చలేదు . అయితే తనకు , అక్కడున్న వారందరికీ ఆయన ఇచ్చే గౌరవం బ్రాండ్ను మండేలాకు దగ్గర చేసింది . వయస్సు , జైలర్ - ఖైదీ అన్న ఆలోచనా , జాతి ఇవేవీ వీరి స్నేహానికి అడ్డు రాలేదు .


మండేలాతో స్నేహం బ్రాండ్ జీవితాన్ని , ఆలోచనలను పూర్తిగా మార్చేసింది . ఏళ్లుగా సాగిన తమ బంధంలో మండేలా నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని , ఆయన పోరాటం గొప్పదని బ్రాండ్ చెబుతూ ఉంటారు . మండేలాను పోలూర్ జైలుకు తరలించాక , బ్రాండ్ కూడా అక్కడికే జైలర్ గా ట్రాన్స్ఫర్ అయ్యాడు . “ మండేలాతో మాట్లాడిన ప్రతిసారీ ఆయనపై గౌరవం రెట్టింపవుతూ వచ్చేది . ఒక జీవిత కాలమంత అనుభవం నాకు ఆయనతో ఉన్నన్ని రోజుల్లో వచ్చేసింది " అంటాడు బ్రాండ్ . వీరిద్దరి కథ ' గుడ్ బై బఫానా ' పేరుతో పుస్తకంగా వచ్చింది . అదే పేరుతో 2007 లో సినిమా కూడా వచ్చింది

 .రాణి పేద ... ఇదో వింత స్నేహబంధం 

అది 1887. క్వీన్ విక్టోరియా మహారాణిగా యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంగ్లండ్ లో వేడుకలు జరుగుతున్నాయి . అప్పటికే భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వెళ్లి ముప్పయ్యేళ్లయింది . ఆ సమయంలో విక్టోరియా తన ప్యాలెస్ లో పని చేయడానికి కొందరు భారతీయులను పంపమని ఆదేశించింది . మహారాణి ఆదేశం ప్రకారంగా ఆగ్రా జైలు సూపరింటెండెంట్ గా ఉన్న జాన్ టేలర్ ఇద్దరు భారతీయులను ఇంగ్లండ్ కు పంపించాడు . ఆ ఇద్దరిలో ఒక్కడే ' అబ్దుల్ కరీం ' .


విక్టోరియా మహారాణి భోజనం చేసే టేబుల్ దగ్గర నిలబడి , ఆమెకు ఏది కావాలంటే అది వడ్డించడం అతడి పని . అలా ఓ రోజు అబ్దుల్ కరీం రాణి కళ్లల్లో పడ్డాడు . అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది . అప్పటికి అబ్దుల్ వయసు 24 ఏళ్లు ... క్వీన్ విక్టోరియా వయసు 65 ఏళ్లకు పైనే !. అబ్దుల్ కొన్ని రోజులకే విక్టోరియాకు ' మునీ ' , ' ట్యూటర్ గామారిపోయాడు . ఆమెకు ఉర్దూ , హిందీ భాషలు నేర్పించేవాడు . అలాగే అబ్దుల్ కు క్వీన్ విక్టోరియా స్వయంగా ఇంగ్లిష్ నేర్పించడం మొదలు పెట్టింది . వారి స్నేహం మరింత బలపడింది . విక్టోరియా సన్నిహితులకు , కుటుంబానికి వీరి స్నేహం నచ్చేది కాదు . వీరిద్దరినీ విడదీయడానికి చాలా పన్నాగాలే పన్నారు . అయితే అవేవీ ఈ స్నేహాన్ని కూల్చలేకపోయాయి . అబ్దుల్ వండే వంటలన్నీ క్రమక్రమంగా విక్టోరియా మెనూలో రోజూవారీ వంటకాలుగా మారిపోయాయి . కోటలో అందరూ అబ్దులకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు . భారతదేశంలో తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి క్వీన్ విక్టోరియా ఎప్పుడూ అంత అబ్దులను అడుగుతూ ఉండేదట . వారిద్దరిదీ ఒక అపురూప స్నేహానుబంధం . వారి స్నేహంపై ' విక్టోరియా అండ్ అబ్దుల్ ' పేరుతో పుస్తకం కూడా వచ్చింది . 


    తదుపరి బ్లాగ్ పోస్ట్‌లో కలుసుకుందాం
                            

1 comment:

  1. Nice 👍 super ,xellent keep rocking 🤘 --LEELA MAHESH

    ReplyDelete

Pages